* మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నిని ఆరు నెలల పాటు జిల్లా నుంచి బహిష్కరణ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
* వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల వైపు వస్తున్న తుఫాను వాహనం ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
* సీబీఐ విచారణలో ఉన్న జడ్జి రామకృష్ణ కేసులో పోలీసులు పొంతనలేని మాటలు చెబుతున్నారు.రామకృష్ణను అరెస్టు చేసినప్పుడు ఆయన ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ ఫోన్ చోరీకి గురైందంటూ పోలీసులు చెబుతున్నారు.స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెబుతున్నారు.అయితే పోలీసుల మాటలపై రామకృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా జడ్జి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకుంటుందో ఈ సంఘటన నిరూపిస్తోందన్నారు.అతి విలువైన సమాచారం ఉన్న తన ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దాన్ని కోర్టులో డిపాజిట్ చేయకుండా.. పోలీసులు నేరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చి.. తద్వారా సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు.దీంతో తాను తన ఫోన్‌ను ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం పోలీసులకు నోటీసులు పంపిందన్నారు.90 రోజులు అవుతోందని, ఇంతవరకు తన ఫోన్‌ను కోర్టులో డిపాజిట్ చేయలేదన్నారు.మూడు రోజుల క్రితం ఒక మెమొను పోలీసులు కోర్టులో పైల్ చేశారన్నారు.తమ కస్టడీలో ఉన్న ఫోన్‌ను ఎవరో దొంగతనం చేశారని ఆ మెమొలో పేర్కొన్నారని రామకృష్ణ చెప్పారు.
* విశాఖలో దారుణం జరిగింది. భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా భర్తను కొట్టి చంపింది.ఈ ఘటన ఏవీఎన్ కాలేజీ ద్వారం వీధిలో తెల్లవారుజామున చోటు చేసుకుంది.భర్త పుండరీకాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి తెలిపింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* పెందుర్తి మండలం చిన్నముసిడివాడ పాత ఊరు గ్రామంలో మద్యం మత్తులో కొత్తపల్లి చిన్న అనే వ్యక్తిపై దాడి.మద్యం మత్తులో ఒక నిండు ప్రాణం బలి.సొంత అల్లుడి తో ఘర్షణ పడిన మామ శంకర్ బావ మరిది అశోక్.గొడవ జరిగిన సమయంలో కొత్తపల్లి చిన్నాని రాడ్ తో తలపై ఆవేశంగా కొట్టడం తో చిన్న అక్కడికక్కడే మృతి.