* ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం.
* వీరవాసరం పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసిన కానిస్టేబుల్స్ గంగాచలం, గణేష్ లు అరెస్టు.
* మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గుర్తుతెలియని హిజ్రా దారుణ హత్య
* కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు దోనబండ చెక్ పోస్ట్ జాతీయ రహదారిపై ప్రమాదం….కంచికచర్ల నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ సడన్ బ్రేక్ వేయడంతో ఢీవైడర్ ను ఢీకొని బోల్తా.
* ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపి ఉన్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.
* వీరవాసరం పోలీస్ స్టేషన్లో నగదు మాయం కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వర్‌రావును అరెస్టు చేసినట్లు ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు.నిందితుల నుంచి రూ.8.04 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
* గుంటూరు జిల్లా…గుజ్జనగుండ్లలో రౌడీషీటర్ మంగరాజు హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు వెంకటేశ్వర్లు, గోపితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.
* రసాయన పరిశ్రమలో పేలుడు- నలుగురు మృతి.మహారాష్ట్ర రత్నగిరిలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది.శనివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చెందగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.దాదాపు 40 నుంచి 50 మంది ఆ ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. పేలుడుకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.