తానాలో ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇరువర్గాల వారు సవాళ్లు, ప్రతిసవాళ్లతో చెలరేగిపోతున్నారు. నిరంజన్ ప్యానెల్ సభ్యులు ప్రస్తుతం నార్త్ కరోలినాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సభలో తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రత్యర్థి వర్గంపై చెలరేగిపోయారు. తాను ఎవరి దయతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదని, సంవత్సరాల తరబడి తానాకు తాను చేసిన సేవలే తాను ఏఖగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తోడ్పడిందని అంజయ్య పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను అన్ని భరించి మౌనంగా ఉన్నానని, ఇక నుండి తన విశ్వరూపం చూపిస్తానని, తాను నిరంజన్ వర్గాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని, ఆ వర్గం విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. మిగిలింది ఆయన మాటల్లోనే వినండి….
నేటి సాయంత్రం నిరంజన్ ప్యానెల్ సభ్యులు షార్లెట్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.