వివాదస్పద ఆలోచనలకు దూరంగా, విశాల భావానికి దగ్గరగా సంస్థ కోసం పోరాడి ఆరాటపడే అన్ని వర్గాల కార్యకర్తలు, నాయకులను కలుపుకుపోయేవాడికి విజయం తప్పక దక్కుతుందని తాను విశ్వసిస్తానని తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డా.నరేన్ కొడాలి అన్నారు. నార్త్ కరోలినాలోని మోరిస్‌విల్(ర్యాలె) ప్రవాసులతో ఆయన తన ప్రచార సమావేశాన్ని నిర్వహించారు. తానా కోసం పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే పదవిని ఆశించడం తప్పు కాదని, ఇటువంటి సందర్భాల ద్వారా అభ్యర్థుల బలాబలాలతో పాటు సంస్థ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా బేరీజు వేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. 18ఏళ్లుగా తానాలో వివాదరహితుడిగా తన రికార్డును చూసి ఓటు వేయాలని, విద్యార్థుల కష్టాలు తెలిసినవాడిగా, పెద్దలతో పాటు యువతతో కూడా పనిచేసిన అనుభవజ్ఞుడిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఆయన చేసిన విజ్ఞప్తికి సభకు హాజరయిన ప్రవాసులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేన్ ప్యానెల్ సభ్యులతో పాటు మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=wM6LXEhaPyY
##############