తానా 2021 ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి నిరంజన్ శృంగవరపు నార్త్ కరోలినా రాష్ట్రంలో శనివారం నాడు ర్యాలె, షార్లెట్ నగరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ తన ఎన్నికల నినాదాన్ని గట్టిగా వినిపించారు. తానాను సరైన దిశలో నడిపేందుకు ప్రస్తుత సమయంలో మార్పు అనివార్యమని, తమ బృందంలో అందరూ తానాకు విశేషంగా ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారున్నారని, వారి నిబద్ధతను, నిజాయితీని చూసి ఓటు వేయాలని తద్వారా మార్పుకు శ్రీకారం చుట్టాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆయన ప్యానెల్ సభ్యులు వేమూరి సతీష్, కొల్లా అశోక్‌బాబు, తూనుగుంట్ల శిరీష, రాజా కసుకుర్తి, రామిశెట్టి సుమంత్, యార్లగడ్డ శశాంక్, గోగినేని కిరణ్, తాళ్లూరి మురళీ, గుదె పురుషోత్తమ చౌదరి, తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు. ర్యాలెలో జరిగిన కార్యక్రమాన్ని గొట్టిపాటి శ్రీధర్, పూర్ణ కొండ్రుకుంట, కోడే మోహన్ తదితరులు సమన్వయపరిచారు.
###############