వివాహానంతరం సినిమాల వేగం పెంచింది పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్. సెలెక్టివ్ కథాంశాలతో సత్తా చాటుతోంది. తాజాగా ఈ సుందరి అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘కాలేజీ రోజుల నుంచి నాగార్జునగారంటే అభిమానం. ఆయనతో కలిసి తెరను పంచుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’ అని కాజల్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేసింది. ‘ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తుంది. యాక్షన్ అంశాల మేళవింపుతో ఆమె పాత్ర శక్తివంతంగా సాగుతుంది. వస్త్రధారణ మొదలుకొని బాడీలాంగ్వేజ్ వరకు ప్రతి అంశంలో కాజల్ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ తీసుకోనుంది’ అని చిత్రబృందం తెలిపింది
ఏజెంట్ కాజల్
Related tags :