WorldWonders

ఢిల్లీలో 21ఏళ్లకు మద్యం తాగవచ్చు

ఢిల్లీలో 21ఏళ్లకు మద్యం తాగవచ్చు

దేశ రాజధాని నగరంలో మద్యపానానికి చట్టబద్ధమైన వయస్సును దిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయస్సు 25 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ కేబినెట్‌ కొత్త మద్యం పాలసీని ఆమోదించిందన్నారు. ఈ కొత్త విధానంలో ఆప్‌ సర్కార్‌ చేసిన పలు మార్పుల్లో భాగంగా వయస్సును కుదించారు. ఈ పాలసీ ప్రకారం.. దిల్లీ నగరంలో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని.. అలాగే, మద్యం దుకాణాలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మద్యం తాగే వయస్సును 21కి మార్చాలని గతేడాది డిసెంబర్‌లో సిపారసు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దిల్లీలో 60శాతం లిక్కర్‌ దుకాణాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయని సిసోడియా తెలిపారు.