అంతర్జాతీయ తోలుబొమ్మలాట దినోత్సవం (మార్చ్ 21) సందర్భంగా నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన ప్రసిద్ధ శ్రీ నటరాజ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీ వారు సుందరకాండ ఘట్టాన్ని తోలు బొమ్మలాట ద్వారా ప్రదర్శించారు. దీనిని వందలాది మంది తెలుగు వారు ఆన్ లైన్ ద్వారా వీక్షించారు. ప్రాచీన కళలను ఆదరించి వాటిని భావి తరాలకు కూడా పరిచయం చేయాలనే సంకల్పంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ న్యూజెర్సీ సమన్వయకర్త సురేశ్ బొల్లు, న్యూజెర్సీ కల్చరల్ చైర్ శేషగిరిరావు (గిరి) కంభంమెట్టు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవలు ప్రసంగిస్తూ తోలుబొమ్మలాట ప్రాముఖ్యతను తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు శివారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి పప్పెట్ షో ద్వారా అలరించారు. విశాఖ శ్రీ మాతా మ్యూజిక్ కంపెనీ ఈ తోలుబొమ్మలాట ఆన్‌లైన్ ప్రదర్శనకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (వెబ్) సుధీర్ మిక్కిలినేని తదితరులు కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో తోలుబొమ్మలాట
Related tags :