‘గొప్పగొప్ప మహిళల జీవితాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. నా మట్టుకు నేను మహారాణి గాయత్రీదేవి, ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా, ఇంద్ర నూయి తదితరుల బయోపిక్‌లలో నటించడానికి ఇష్టపడతాను. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ధీమంతులు. గాయత్రీదేవి పురుషాధిక్య సమాజంలో తనదైన ఉనికిని చాటుకున్నారు. అందం, ఆత్మవిశ్వాసం.. రెండూ తనలో ఉన్నాయని చాటుకున్నారు. ఇక, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గురించి చెప్పేదేముంది? కల్పనా చావ్లా పాత్రలో నన్ను నేను ఊహించుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. ఇంద్రనూయి పాత్రను ధరించడమే కాదు, ఆమెలా వ్యాపార దిగ్గజం కావాలన్నదీ నా కోరిక’ అంటారు సినీనటి తాప్సీ.
తాప్సీకి పులకరింతలు
Related tags :