విశాఖపట్నంలో అమెరికా కార్నర్ ప్రారంభం
దక్షిణ భారతం దేశంలో ఇదే మొట్టమొదటిది
ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటైన అమెరికా కార్నర్
* వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన అమెరికా కాన్సులేట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్
మంత్రి సమక్షంలో ఎంఓయూపై వర్చువల్ పద్దతిలో ఎంఓయూపై సంతకాలు చేసిన అమెరికా కాన్సులేట్, ఆంధ్రావర్సిటీ అధికారులు
ఈ కార్నర్ ద్వారా విద్యార్థులకు అమెరికా విద్యాపై, ఉన్నత విద్యపై సదస్సులు, వర్క్‌షాపులు
అమెరికా నుంచి నిధులు వచ్చే సౌలభ్యం
*అమెరికా కార్నర్ ప్రారంభం కావడం సంతోషదాయకం: మంత్రి ఆదిమూలం సురేష్ *
అమెరికా విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది
ఉన్నత విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు
రాబోయే రోజుల్లో విశాఖలో 2 వేల ఉద్యోగాల కల్పన దిశగా పరిశ్రమలు స్థాపన
*పేద విద్యార్థులకు విదేశీ విద్య చేరువ చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంద్న మంత్రి ఆదిమూలం సురేష్
అమెరికా కార్నర్ ఆంధ్రావర్సిటీకే తలమానికం కానుందన్న ఏయూ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్‌రెడ్డి
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా దేశంలోనే ఇది బెస్ట్ కార్నర్‌గా తీర్చిదిద్దుతామన్న వీసీ
ఏపీలో అమెరికా కార్నర్ ఏర్పాటు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్న అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్
దీని ద్వారా అమెరికా, ఆంధ్రా మధ్య సంభంధాలు మరింత బలోపేతమవుతాయి
*కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చందర్, సీఎం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, అమెరికా పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయెర్, రీజినల్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ స్పెషలిస్ట్ న్యూఢిల్లీ మార్క్ బుర్రెల్.