మనిషికి కాలం విలువ తెలుసు, మనిషికి డబ్బు విలువ తెలుసు, మనిషికి స్వేచ్ఛ విలువ తెలుసు, మనిషికి బంధాల విలువ తెలుసు, మనిషికి ప్రాణం విలువ తెలుసు !!
ఇవన్నీ తెలిసినా !
మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడంలేదు…???
?????
నీ జీవితం లో ! నిన్ను నమ్మిన వాళ్ళని,
ఎప్పుడు మోసం,
చేయాలనీ చూడకు,
ఎందుకంటే ! నమ్మకం ప్రాణం లాంటిది,
ఒక్కసారి నమ్మకం పోతే !
మళ్ళీ తిరిగి రాదూ…
జీవితం అంటే ! మనం చనిపోయేంతవరకూ,
బ్రతికి ఉండటం కాదు,
పది మంది మనసులలో,
పది కాలాల పాటు,
జీవించి ఉండటమే !
జీవితం…
కన్న వాళ్ళ మీద,
కొడుకుల కంటే !
కూతుర్లకే అనురాగం ఎక్కువ,
ఎందుకంటే ! కొడుకులు ఆస్తులు పంచుకుంటే !
కూతుర్లు మాత్రం అలా కాదు !
అనురాగాన్ని పంచి ఇస్తారు…
మనిషికి కాలం విలువ తెలుసు,
మనిషికి డబ్బు విలువ తెలుసు,
మనిషికి స్వేచ్ఛ విలువ తెలుసు,
మనిషికి బంధాల విలువ తెలుసు,
మనిషికి ప్రాణం విలువ తెలుసు,
ఇవన్ని తెలిసిన మనిషికి,
ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు ?
సంతోషం అనేది,
మనకు గొప్ప ఖజానా,
ఈ ఖజానా సంపన్నంగా ఉన్న వారు,
భాగ్యవంతులు,
ఏదో చేస్తేనే సంతోషం వస్తుంది అంటూ బ్రమ పడకూడదు,
మనం సంతోషంగా ఉండగలిగితే ! ఏదైనా సరే !
సాధిస్తామంటూ అర్థం చేసుకోవాలి,
మీరు సంతోషంగా ఉండండి,
మీ వద్దకు వచ్చిన వారికి కూడా !
సంతోషాన్ని పంచుతూ ఉండండి,
మనం ఎదుటి వారికి సంతోషాన్ని,
ఎంత పెంచుతామో అంత,
మీకు సంతోషం రెట్టింపు అవుతుంది,
అందుకే ! ఎదుటి వారికి మనం,
సంతోషం పంచడమే !
అన్నింటికన్నా గొప్ప దాన గుణం…