Videos

సెలైన్‌తో వైద్యుడి కారు తుడిచిన నర్సు-[Video]

సెలైన్‌తో వైద్యుడి కారు తుడిచిన నర్సు-[Video] - Kurnool District Huzurabad Nurse Uses Saline Water To Clean Dr.Pratyusha Car

అత్యవసర సమయాల్లో రోగి ప్రాణాన్ని నిలిపే సెలైన్‌ను ప్రభుత్వాసుపత్రులు దుర్వినియోగం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రోగులకు ఎక్కించాల్సిన సెలైన్‌ను కారు తుడిచే నీళ్లలా వాడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న రోగులు ఆ దృశ్యాలను చిత్రీకరించగా ఆ వీడియో వైరల్‌గా మారింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి రంగులు వేస్తున్నారు. అక్కడే డాక్టర్‌ కారు నిలిపి ఉంచగా దానిపై సున్నం పడింది. దాన్ని తుడిచేందుకు సిబ్బంది ఏకంగా సెలైన్‌ను నీళ్లలా వాడారు. ఇదేంటని ప్రశ్నిస్తే…..సెలైన్‌ సీసాలో నీరు పోసి తుడుస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు. సెలైన్‌ సీసాలో నీళ్లు నింపే అవకాశాలు తక్కువని, కావాలనే ఔషధాలను దుర్వినియోగం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించకపోగా ప్రతి చిన్న రోగానికి వరంగల్‌ ఎంజీఎంకు రిఫరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.