జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వెండిని ఆభణంగా ధరించినట్లయితే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఉపాధి పొందుతారు. అంతేకాకుండా జాతకంలో గ్రహ దోషాలుంటే తొలుగుతాయి. జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
*భారతీయ సంప్రదాయంలో నగలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. జీవితంలో పొదుపు చేసిన మొత్తాన్ని ఆభరణాల కొనుగోలుకే ఎక్కువ వెచ్చిస్తారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు విరివిగా కొనుగోలు చేస్తారు. అయితే బంగారంతో పాటు వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. బంగారంతో పోలిస్తే ధర తక్కువైనప్పటికీ కొన్నింటికి బంగారం కంటే వెండినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ధర్మశాస్త్రాలు కూడా వెండి ప్రాముఖ్యాన్ని అంగీకరించాయి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పూజలకు వెండినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వెండి అదృష్టాన్ని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉపాధిని కూడా కలిగస్తుంది. మరి వెండి ఆరోగ్యం, ఉపాధిలో ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
*ఆరోగ్యానికి ఎలా మంచిదంటే..
వెండిని ఆభరణంగా ధరించడం ఎంతో శుభపరిణామంగా భావించాలి. ముఖ్యంగా వేళ్లలో చిన్న వేలుకు వెండితో చేసిన ఉంగరాన్ని ధరస్తే ఎంతో మంచిది. దీని కారణంగా మానసికంగా బలహీనంగా ఉండే వ్యక్తులు ఊరట పొందుతారు. వెండితో తయారు చేసిన గొలుసు మెడలో ధరిస్తే మీరు మంచి వక్తలుగా పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో హార్మోన్ల సమతూల్యం కావడం ప్రారంభిస్తాయి. ఇది అనేక వ్యాధుల నుంచి ఉపశమనం అందిస్తుంది.
అన్ని రోగాలను పారద్రోలుతుంది..
స్వచ్ఛమైన వెండికి చెందిన పెద్ద ముక్కను ఆభరణంగా ధరిస్తే మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి కాకుండా వాతం, పిత్తాశయానికి చెందిన సమస్యలు, దగ్గు లాంటివి నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తులు అంత త్వరగా అనారోగ్యానికి గురికారు. వెండి గ్లాసు లేదా గిన్నెలో నీరు తాగితే జలుబుతో పాటు శీతల సమస్యలు రాకుండా ఉంటాయి. స్వచ్ఛమైన తేనేను వెండి గిన్నే లేదా చెంచాతో తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
*గ్రహ దోషాలు దూరమవుతాయి..
జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండి అనేది చంద్రుడు, శుక్ర గ్రహాలకు సంబంధించినది. వెండి పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి పుట్టిందని నమ్ముతారు. పండితుల అభిప్రాయం ప్రకారం సోమవారం రోజు వెండితో పాటు పాలు, పెరగు, నెయ్యి, తేనే, చక్కెరతో చేసిన శంకరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేస్తే శరీరంలోని అన్ని వ్యాధులు తొలుగుతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలిగి సాంత్వన పొందుతారు.
*వృత్తి, వ్యాపారాల్లో పురోగతి..
వెండి గ్రహ దోషాలను మాత్రమే కాదు.. దీన్ని ఇంట్లో ఉంచితే ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. మీ జేబులో చదరపు వెండి ముక్కను ఉంచుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నత హోదాలను పొందుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారవేత్త అయినట్లయితే వెండితో చేసిన ఏనుగు బొమ్మను జేబులో ఉంచుకుంటే వ్యాపారంలో వృద్ధితో పాటు లాభాలు పొందుతారు. అంతేకాకుండా నిరుద్యోగులతై ఇంటర్వ్యూలు అందుతాయి. మానసిక ఒత్తిడి కూడా దూరమై ఆరోగ్యంగా ఉంటారు.
వెండి ధారణ శుభప్రదం
Related tags :