* అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని రైతులు, ఇతరులు వేసిన పిటిషన్‌పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. పిటిషన్‌లపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
* పిల్లలకు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడాడు. పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వర రావు గురువారం పాఠశాలలోనే మద్యం సేవిస్తూ బిరియాని తింటుంటడం గమనించిన పిల్లల తల్లిదండ్రులు వీడియో తీశారు. అయినప్పటికీ మేలుకోని ఆయన దుస్తులు విప్పుతా తీసుకుంటారా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. వీడియో తీసుకోండంటూ మద్యం బాటిల్, బిరియాని పైకెత్తి మరీ చూపించాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరై చిన్న చిన్న విషయాలకే విద్యార్ధుల దుస్తులు విప్పి పైశాచికంగా ప్రవర్తిస్తున్న కోటేశ్వరరావుపై అప్పటికే ఆగ్రహంగా వున్న తల్లిదండ్రులు ఆ వీడియోను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు గతంలో కుప్పంలో పని చేసినప్పుడు కూడా ఇలాగే తాగి పాఠశాలకు హాజరయ్యే వాడని సమాచారం.
* ఏ-కొండూరు మండలంలో పలు కిరాణా దుకాణాల్లో స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల తనిఖీలు..నాటుసారా తయారీకి ఉపయోగించే 782 కేజీల బెల్లం, 51 కేజీల పటిక స్వాధీనం..రేపూడి తండాల్లో సారా తయారిపై దాడులు..3లీటర్ల నాటుసారా, 600 లీటర్ల ద్వంసం చేసి 2 వాహనాలు సీజ్ ..నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్న:ఈ/చ్ సిఐ ఐ.ఎన్.ఎస్. బాలాజీ..
* విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు బుద్ది గడ్డి తింది. తండ్రిలా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినులతో అసంభ్యంగా ప్రవర్తించాడు. చీరాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ చేష్టలు ఎక్కవకావడంతో విద్యార్ధినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. గతంలోనూ సురేష్ ఇలా ప్రవర్తించడంతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడని, అయినా ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉన్నతాధికారులు కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* తమ భూమిని ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం హల్ చల్ చేసింది.