ScienceAndTech

కంప్యూటర్లు ఫోన్లు బాగా చూస్తున్నారా?

కంప్యూటర్లు ఫోన్లు బాగా చూస్తున్నారా?

స్మార్ట్‌ఫోన్లూ, కంప్యూటర్లూ, కాలుష్యం, ఏసీలూ… కారణమేదయినా ఈమధ్య చాలామందిలో కళ్లు పొడిబారడం అనేది రోజురోజుకీ పెరిగిపోతోంది. దీన్ని అలాగే వదిలేస్తే కంటిచూపుకే ప్రమాదం అంటున్నారు సౌతాంప్టన్‌ పరిశోధకులు. దీనివల్ల తరచూ కళ్లు ఎర్రగా కావడం, దురదపెట్టడం, చూపు మసకబారడం, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లుగా ఉండటం జరుగుతుంటుంది. ఇది 65 ఏళ్ల పైబడిన వాళ్లలోనే మరీ ఎక్కువట. తాత్కాలికంగా దీన్ని నివారించేందుకు లూబ్రికెంట్లూ టియర్‌ డ్రాప్సూ ఇస్తుంటారు వైద్యులు. కానీ చాలామంది అవి కూడా వాడకపోవడంతో వ్యాధి తీవ్రత పెరగడమే కాకుండా వాళ్ల రోజువారీ పనుల్లో కూడా ఇబ్బంది పడుతున్నట్లు పరిశీలకుల అధ్యయనంలో తేలిందట. అంతేకాదు, ఈ సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లలో డిప్రెషన్‌, ఆందోళనలు ఎక్కువగా ఉన్నట్లూ గుర్తించారట. కాబట్టి తొలిదశలోనే ఈ సమస్యను నివారించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.