ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికాకు వచ్చే నిరుపేద ప్రతిభావంతులైన ప్రవాస తెలుగు విద్యార్థులతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు తానా ఫౌండేషన్ తరఫున అందజేసే ఉపకారవేతనాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని 2021 తానా ఎన్నికల్లో డా.కొడాలి నరేన్ ప్యానెల్ నుండి ఫౌండేషన్ ట్రస్టీగా పోటీలో ఉన్న యెండూరి శ్రీనివాస్ TNIతో అన్నారు. సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన తానా ఫౌండేషన్ ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే సంక్షేమ పథకాల రూపకల్పనకు సైతం తాను చొరవ తీసుకుంటానని, ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఆయన తానా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరుకు చెందిన ఆయన 1998లో H1పై అమెరికాకు వచ్చి స్థానిక పౌరసత్వం తీసుకుని కనెక్టికట్ రాష్ట్రంలో స్థిరపడ్డారు. గత 15ఏళ్లుగా తానాతో అనుబంధం కలిగిన ఆయన టీంస్క్వేర్ కార్యకర్తగా కీలకమైన సేవలందించారు. తానాతో పాటు ఆయన కనెక్టికట్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యుడిగా నాలుగేళ్లు సేవలందించారు. APNRT కనెక్టికట్ రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరించారు. కనెక్టికట్ షిర్డీ సాయి ఆలయ కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీలో పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు. వైజాగ్ హుద్‌హుద్ బాధితులకు సహాయ నిధులను సేకరించారు. బసవతారకం ఆసుపత్రికి విరాళాలు సేకరించారు.
తానా ఉపకారవేతనాల సంఖ్య పెంచేందుకు కృషి-TNIతో ఫౌండేషన్ ట్రస్టీ అభ్యర్థి యెండూరి శ్రీనివాస్
Related tags :