దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునికీకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థకు సహకరించాలని, నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. బోంబే హైకోర్టు గోవా ధర్మాసనం నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునికీకరించాలని, నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జస్టిస్ రమణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. న్యాయం అందుబాటులో ఉండటం, సత్వర న్యాయం జరగడం చాలా ముఖ్యమని, ఇవి చట్టబద్ధ పాలనకు పునాదిని నిర్మిస్తాయని చెప్పారు. పెరుగుతున్న వివాదాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలు పెరగాలని చెప్పారు. ప్రతి జిల్లాకు కోర్టులు ఉన్నాయని, అయితే వీటిని సవాళ్ళకు తగినట్లుగా ఆధునికీకరించాలని అన్నారు.
జాతీయ జుడీషియల్ ఇన్ఫ్రా కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి
Related tags :