రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఈ నెల 30న బైపాస్ చికిత్స చేయనున్నారు. శుక్రవారం ఆయనకు ఛాతిలో ఇబ్బంది తలెత్తడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు రాష్ట్రపతిని శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రణాళికాబద్ధమైన బైపాస్ చికిత్సా విధానాన్ని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఉదయం ప్లాన్డ్ బైపాస్ ప్రోసెస్‌ను ఎయిమ్స్ వైద్యులు చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని, ఆయన ఎయిమ్స్ నిపుణుల సంరక్షణలో ఉన్నారని పేర్కొంది. తన ఆరోగ్యంపట్ల ఆరా తీసి, కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికి రాష్ట్రపతి ధన్యవాదాలు చెప్పినట్లు ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.
30న రాష్ట్రపతికి బైపాస్
Related tags :