సగటున 10ఏళ్లు తానాలో సేవ చేసిన అనుభవజ్ఞులు కలిగిన సంఘటిత కార్యకర్తల సేనాశక్తి తమ ప్యానెల్ అని 2021 తానా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డా.నరేన్ కొడాలి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం DFW ప్రాంతీయ ప్రవాసులతో ప్లేనోలోని మినెర్వాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తమలో తమకు విభేదాలు ఉంటే చర్చించుకోవడానికి వెనుకాడమని, ప్రత్యర్థులతో ఉన్నవి అభిప్రాయ భేదాలే తప్ప శాశ్వత విభేదాలు కావని ఆయన స్పష్టం చేశారు. చేసేది చెప్తామని, చెప్పింది చేస్తామని ఆయన అన్నారు. విద్యార్థుల కష్టాలు తనకు ఒక విద్యార్థిగా ఒక అధ్యాపకుడిగా లోతుగా తెలుసునని అందుకే ఇమ్మిగ్రేషన్, విద్యాపరమైన అంశాలను తానా ప్రధానోద్దేశాల్లో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. టీంస్క్వేర్ లాంటి వ్యవస్థను విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి పూర్వం తన ప్యానెల్ సభ్యులు మన్నే సత్యనారాయణ, గుడిసేవ విజయ్, పొట్లూరి రవి, పంత్ర సునీల్, వెంకట్ కోగంటి, కాకర్ల రజనీకాంత్, సూరపనేని రాజా, ప్రభల జగదీష్, మందలపు రవి తదితరులను నరేన్ సభకు పరిచయం చేసి మాజీ అధ్యక్షుడు డా.గొర్రెపాటి నవనీతకృష్ణకు మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, వేమన సతీష్‌లతో కలిసి నివాళులు అర్పించారు.
###########