నిర్భాగ్యురాలు జయలలిత వెళ్ళిపోయింది..పెళ్ళి లేదు..పిల్లలు లేరు. అనుభవించే వారసులు లేరు..ఒకరి మాట వినని నియంతృత్వం. దురాశ తో ఎంత సంపాదించి ఏమి లాభం..?ఆవిడ ఒక్క చిన్నమెత్తు కూడా తనతో తీసుకు వెళ్ళలేదు..
ప్రజల సొమ్ము పదకాల పేరుతో తో ప్రజలకు పెట్టడం తప్ప ఎంత సంపాదించిన ప్రజలకు తన సొంత సొమ్ము ఎవరికి ఇవ్వలేదు.. ?ఎంతో చురుకైన జయలలిత తమిళనాడు ను పాలించిన విషయం ఇప్పుడు, కేవలం గుర్తుగా మి గుగిలిపోయింది..
ఇప్పటికైతే ఆరడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వితంగా స్థానం ఆక్రమించి, తనకున్న వేల ఎకరాలు వదిలిపెట్టి వేసింది. ఆవిడ కేవలం ఒక శవ వాహక వాహనం లో ప్రయాణం చేసి గమ్యం చేరుకుంది, తనకున్న కార్లు, పొలాలు, స్తళాలు భవంతులన్ని వదిలి వేసి..
ఆవిడ సంపాదించిన ఆస్తి చాలా పెద్దది. లిస్టు ఇస్తానుమీకు
తిరునెల్వేలి లో 1197 ఎకరాలు
రెండు వందల ఎకరాలు వలజాపేట్ట
100 ఎకరాలు ఒత్తుకొట్ట
25 ఎకరాలు షిరుత్త వూర్
ఒక చోట 200 ఎకరాలు మరొకచోట 100 ఎకరాలు కాంచీపురం లో..
14.5 ఎకరాల ద్రాక్షతోట జీడిమెట్లలో (తెలంగాణాలో)
kodanad టీ ఎస్టేట్ 1,600 ఎకరాలు (బంగ్లాలు కూడా) మొత్తం నీలగిరి లో ఉన్నాయి..
ఇవి కాక 24,000 చ”అ” వేదనిలయం అనేపేరుతో (పోయస్ గార్డెన్) కనీస ఖరీదు 100 కోట్లు
కమర్షియల్ భవనాలు ఒకటి చెన్నయ్, ఒకటి హైద్రాబాద్
800 కిలోల వెండి
28 కిలోల బంగారం
750 జతలు చెప్పులు (లేక బూట్స్)
10,500 ఖరీదైన చీరలు
91 వాచీలు
2 టయోట Prado SUVs
టెంపో ట్రావెలర్
టెంపో ట్రాక్స్
మహేంద్రా జీప్
అంబాసిడర్ కార్
మహేంద్రా బోకెరు
స్వరాజ్ మర్జ్డా మాక్స్
కొంటెస్సా
పై తొమ్మిది వెహికల్స్ ఖరీదు సుమారు రూ”42, 25,000/- (1997 కి)
బినామీ ఆస్తులు చేర్చబడలేదు.
ఆమె జీవితం ప్రపంచంలోని వారికి ఒక గుణపాఠం. భగవంతుడు నుంచి పిలుపు రాగానే ఉన్నది ఉన్నట్టు వదిలిపెట్టి వెళ్ళాలిఅని. కనీసం దగ్గర వారికి వస్తా అని చెప్పే అవకాశం కూడా దొరక్కపోవచ్చు..ఎవరూ రక్షించలేరు ఎవరు సహాయం చేయలేరు..
ప్రాణమిచ్చే ప్రజలు, ఒక్క పిలుపు తో పెల్లుబికి వచ్చే ప్రజాబాహుళ్యం కలిగి ఉండి కూడా, నోటి మాటకై ఎదురుచూసే అనుచరగణం వుండి కూడా, దేశవిదేశాలలో గొప్ప గొప్ప వైద్యులు హాస్పిటల్స్ వుండి కూడా, కనీసం తులసి తీర్థం గొంతులో పోవటానికి కూడా బాధ్యత తీసుకొని ఆఖరి ధర్మాలు నెరవేర్చటానికి కూడా (ఈ కరోనాకాలంలో ఆ అనుభవం కూడా ఎందరికో జరిగింది-వారసులు కలిగిన వారికి..
జయలలిత కైయితే వారసులు లేని పరిస్థితి)
మనమంతా జీవనగమనంలో ప్రయాణిస్తున్నాం.
ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఇక్కడి ప్రయాణం చాలించి, అక్కడికి మరునిమిషమే ప్రయాణమవ్వాలి.. అహంకారాలు స్వార్ధపరత్వం కక్షలు, కార్పణ్యాలు, తత్సంబంధమైన ఇతరాలు, వదిలివేసి పూర్తిగా మంచి మార్గంలో ప్రయాణించి ఎదుటివారికి కష్టం కలగకుండా జీవించగలిగితే ధన్యులే..