* కర్నూలు జిల్లా లోని పలు ఆలయాల్లో హుండీలను ధ్వంసం చేసి నగదు,బంగారు నగలు,వెండి ని దోచుకెళ్లిన నిందితులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.కర్నూలు జిల్లా లోని గోనెగండ్ల,వెల్దుర్తి, హాలహర్వి పీఎస్ పరిధిలో ఉన్న పలు ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలపై ఉండే నగలు,పంచలోహ విగ్రహాలు ,హుండీలను ధ్వంసం చేసి దోచుకెళ్తు జల్సాలకు పాల్పడుతున్నారు.ఆలయాల్లో చోరీలకు పాల్పడే నిందితులందరు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.వారి వద్దనుండి సుమారుగా 16 లక్షల నగదుతో పాటు,29 తులాల బంగారు నగలు, పంచ లోహ విగ్రహాలు,ఒక బైకును కూడా స్వాధీన పర్చుకొని రిమాండుకు తరలించారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు జిల్లా శ్ఫ్ కాగినెల్లి పక్కిరప్ప అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
* బిహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చిన్నారుల్ని కాపాడలేకపోయారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే కావడం అందరినీ కలిచివేస్తోంది.
* శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస సమీపంలో ఈతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు చేపల లోడుతో వెళ్తున్న మినీ వ్యాను అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నీళ్లలో ఊపిరాడక మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో మినీ వ్యాను, మృతదేహాలను బయటకు తీశారు. మృత వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
* మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఖుర్ ఖేడా తాలూకా కొబ్రామెండా అటవీ ప్రాంతంలో నిన్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులను తివ్వాఘడ్ డ్వ్ఛం దళానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో తప్పించుకొన్న మావోయిస్టులు సరిహద్దు ప్రాంతమైన తెలంగాణ లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతంలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వంతెన వద్ద తెల్లవారుజాము నుండి వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమాన వ్యక్తుల పేర్లు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలైన పలుగుల ,కుంట్లం ,పలిమెల, సర్వాయిపేట, ముకునూర్ ,నీలంపల్లి ,సింగంపల్లి ,కనుక నూర్ అటవి గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు.
* జాతీయ రహదారి 65 పై గట్టు భీమవరం టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీ ఒకసారే ఆగడంతో వెనుక వెళ్ళే బైక్ ఢీ.బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు.రోడ్ మీద పడి మృతి చెందిన తండ్రి, చిన్నపాప.తల్లి, పెద్దపాపకు గాయాలు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.