ఈ మధ్య కాలంలో టైం పాస్ ఎక్కువ మంది తింటున్నవి పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలే సరదాగా తిన్నా ఈ విత్తనాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
*పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా..అయితే ఈ రోగాలు దూరం..పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా..అయితే ఈ రోగాలు దూరం..సూర్యుడు ఎటువైపు ఉంటే అటు వైపు తిరిగే సూర్యకాంతం పువ్వులు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ పూలు తెలిసినా తెలియకపోయినా సన్ ఫ్లవర్ ఆయిల్, సన్ ఫ్లవర్ సీడ్స్ (Sunflower Seeds) అయితే తప్పక తెలుస్తుంది. అమెరికాకి చెందిన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది. ముఖ్యంగా దీన్ని నూనె కోసమే పెంచినా సన్ ఫ్లవర్ గింజలను కూడా చాలామంది తినేందుకు ఇష్టపడుతుంటారు. వీటిని అలాగే తినేందుకు కొందరు ఇష్టపడితే వేయించుకొని మరికొందరు తింటుంటారు. ఇవే కాకుండా సన్ ఫ్లవర్ తో పొడి తయారుచేసి దాన్ని స్నాక్స్ తయారీలో వాడడం, సన్ ఫ్లవర్ బటర్ తయారీలో ఉపయోగించడం వంటివి చేస్తుంటారు. అయితే ఎలా తిన్నా సన్ ఫ్లవర్ గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. సన్ ఫ్లవర్ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఇవి విటమిన్లు, మినరల్స్ కి నిలయాలు. ఇందులో ముఖ్యంగా బీ కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఇ లతో పాటు ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి మన ఎముకల ఆరోగ్యం, ముఖ్యమైన అవయవాల పనితీరు బాగుండేలా చూస్తాయి. శరీరంలోని ఎన్ని జీవనక్రియలకు సాయపడతాయి. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
**డయాబెటిస్ దూరం..
డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం తగినంత మోతాదులో ఇన్సులిన్ ని విడుదల చేయలేదు. దీనివల్ల శరీరంలోని కణాలన్నింటికీ తగిన మోతాదులో గ్లూకోజ్ అందకపోవడంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. గుండె, కిడ్నీలు, కంట్లోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. సన్ ఫ్లవర్ గింజలు చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ని కలిగి ఉండడమే కాదు.. ఇందులోని క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలోని చక్కెర స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది.
**గాయాలు తగ్గిస్తుంది..
సన్ ఫ్లవర్ గింజల్లో లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది గాయాలను మాన్పడంలో ఎంతో సాయం చేస్తుంది. సన్ ఫ్లవర్ గింజలు రోజూ తీసుకునేవారిలో గాయాలు తొందరగా మానిపోతాయని అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది.
**యాంటీ ఇన్ ఫ్లమేటరీ కూడా..
గాయాలు, ఇన్ఫెక్షన్ వంటివి ఎదురైనప్పుడు ఆ ప్రాంతంలో వాపు, నీరు పట్టడం వంటివి జరుగుతుంటాయి. ఇలా కాకుండా ఎప్పుడూ వాపు ఉన్నట్లే ఉంటే దాన్ని క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ అంటారు. ఇది ఎక్కువ కాలం అలాగే కొనసాగితే శరీరంలోని అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. గుండెపోటు, క్యాన్సర్ వంటి వాటికి దారి తీస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లోని విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ అనే ఫినోలిక్ కాంపౌండ్స్ ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించడంలో సాయపడతాయి.
**గుండె జబ్బులను నివారిస్తుంది..
ఎక్కువ మోతాదులో లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్ (LDL) ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తనాళాల లోపల కొవ్వు పేరుకుపోతుంది. ఇది గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. సన్ ఫ్లవర్ గింజల్లో ఎక్కువగా ఉండే లినోలిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ స్థాయులను LDL కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇందులోని ఓలిక్ యాసిడ్ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే ఈ రోగాలు పరార్
Related tags :