ఈ మధ్య చాలా మంది గుమ్మానికి ప్లాస్టిక్ తోరణాలు కడుతున్నారు. వాటి వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మామిడి ఆకులతో కట్టిన తోరణం మంచి చేస్తుంది. ఇంతకీ మామిడి ఆకులతో లాభాలేంటో తెలుసా? పూర్వం నుంచి మామిడి ఆకులను తోరణాలుగా కట్టుకోవడం మనకు సంప్రదాయంగా వస్తున్నది. ఈ మామిడి తోరణాల వెనుక సైన్స్ కోణం దాగి ఉన్నది. మామిడి తోరణాన్ని గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి రాకపోకలు సాగించే సమయంలో తలపై ఉండే బ్యాక్టీరియాను మామిడి ఆకులు పీల్చుకుంటాయి. తరచూ చెవిపోటు లేస్తోందా? మామిడి ఆకులను మరిగించి ఆ నీటిని చెవిలో వేసుకోవడం వల్ల చెవినొప్పి, దాని సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దీంతో తాత్కాలికంగా సమస్య దూరమవుతుంది.మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మరిగించిన మామిడి ఆకులు గ్రీన్ టీ లాగే పనిచేస్తాయి. ఆ రసం సేవించడం ద్వారా బాడీలో టాక్సిన్స్ తొలిగిపోతాయి.మరిగించిన మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మానసిక ఒత్తిడి, అజీర్తి వంటి సమస్యలకు కూడా ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది.మామిడి ఆకుల రసాన్ని రోజు తాగడం వల్ల నోటి సమస్యలు, చిగుళ్ల సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు కూడా దరికిచేరవు.
మామిడి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు
Related tags :