ఆస్ట్రాజెనికా టీకాతో లింకు ఉన్న బ్లడ్ క్లాటింగ్‌కు సంబంధించి కొత్తగా 25 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆరోపణల నేపథ్యంలో పలు యురోపియన్ దేశాలు ఆస్ట్రాజెనికాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే తాజా నివేదికతో బ్రిటన్‌లో బ్లడ్ క్లాటింగ్ కేసుల సంఖ్య మార్చి 24వ తేదీన నాటికి 30కి చేరుకున్నట్లు హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొన్నది. అయినా కానీ ఆస్ట్రాజెనికా టీకా వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నట్లు ఆ ఏజెన్సీ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన టీకాను ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాలకు ప్రస్తుతం యూరోప్‌లో ఆదరణ తగ్గింది. మార్చి 24వ తేదీ నాటికి మొత్తం కోటి 80 లక్షల మందికి ఆస్ట్రాజెనికా టీకా ఇచ్చామని, దాంట్లో కేవలం 30 మాత్రమే బ్లడ్ క్లాటింగ్ కేసులు నమోదు అయినట్లు ఆ ఏజెన్సీ చెప్పింది. తాజా నివేదిక ప్రకారం ఆరు లక్షల మందిలో ఒకరికి మాత్రమే రక్తం గడ్డకడుతున్నట్లు తేల్చారు. బ్రిటన్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫైజర్, బయోఎన్‌టెక్ టీకాలతో మాత్రం ఇలాంటి కేసులు నమోదు కావడం లేదు.
ఆస్ట్రాజెనికా టీకాతో రక్తం గడ్డలు
Related tags :