Business

BSNL నూతన ప్లాన్-వాణిజ్యం

BSNL నూతన ప్లాన్-వాణిజ్యం

* ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్‌) తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను తీసు కొచ్చింది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్ కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది.

* సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్‌) ద్వారా ప్ర‌తీనెలా మ‌దుప‌రి నిర్ణ‌యించిన ప్ర‌కారం కొంత మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు వీల‌వుతుంది. దీర్ఘ‌కాలంలో చూస్తే స్థిరంగా ఒకే మొత్తం సిప్‌ పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం కంటే సంవ‌త్స‌రానికి ఒక సారి పెంచుతూ వెళ్తే వ‌చ్చే ప్ర‌తిఫ‌లం అద్భుతంగా ఉంటుంది.

* ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్యం నిర్వహించేది లేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. గురువారం కేబినెట్‌ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ పత్రిక ‘డాన్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్‌ నుంచి చక్కెర, పత్తి దిగుమతుల నిర్ణయంపై పాకిస్థాన్‌ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూటర్న్‌ తీసుకోవడానికి ముందు జరిగిన పరిణామాలను కొన్ని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ డాన్‌ ప్రచురించింది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ వ్యవస్థాపకుడు దివంగత బ్రిజ్‌మోహన్‌ లాల్‌ ముంజల్‌ సతీమణి సంతోష్‌ ముంజల్‌(92) కన్నుమూశారు. శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ముంజల్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1947లో బ్రిజ్‌మోహన్‌ లాల్‌తో ఆమె వివాహం జరిగింది. 1953లో హీరో సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆమె బ్రిజ్‌మోహన్‌కు వెన్నంటి నిలిచారు.

* వ్యాపారవేత్త, బిలియనీర్‌, డీమార్ట్‌ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్‌ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్‌ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.

* ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత పరిస్థితి. డీల్స్‌ స్థాయితో సిబ్బంది నైపుణ్యతను పోలిస్తే అసమతుల్యత ఏర్పడుతోంది. అట్రిషన్‌ కోవిడ్‌ ముందస్తు స్థాయికి 17-20 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. సిబ్బంది ఉద్యోగాలు మారుతుండడమే ఇందుకు కారణం. మహమ్మారి నేపథ్యంలో ఆధునీకరణ, డిజిటల్‌ వైపు మార్కెట్‌ దూసుకెళ్తుండడంతో కంపెనీల వ్యయాలు పెరిగాయి. కోవిడ్‌ కారణంగా మందగించిన డిమాండ్‌ను అందుకోవడానికి సంస్థలు మరింత విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్‌ నైపుణ్యాలు ఉన్న మానవ వనరుల కొరత యూఎస్, ఈయూతోపాటు ఇటీవల భారత్‌లోనూ చూస్తున్నట్టు రిసర్చ్‌ కంపెనీ ఎవరెస్ట్‌ గ్రూప్‌ చెబుతోంది.