DailyDose

తెలంగాణాలో డ్రగ్స్ సరఫరాలో విస్తుపోయే విషయాలు-నేరవార్తలు

తెలంగాణాలో డ్రగ్స్ సరఫరాలో విస్తుపోయే విషయాలు-నేరవార్తలు

* బోడ సునీల్ నాయ‌క్ మృతికి రాష్ట్ర‌ స‌ర్కారే కార‌ణ‌మ‌ని… వెంట‌నే కేసీఆర్ పై కేసే న‌మోదు చేయాల‌ని హైద‌రాబాద్ యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు మోత రోహిత్ డిమాండ్ చేశారు. లేదంటే యువ‌జ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జైల్ భ‌రో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌కుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను అంబ‌ర్‌పేట్ 6నెంబ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద ద‌గ్దం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. దీంతో కొద్ద‌సేపు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. చివ‌ర‌కు యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌లు కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను త‌గుల‌బెట్టారు. ఈ సంద‌ర్భంగా మోత రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం, యువ‌త‌కు ఉపాధి వంటి వాటి‌పై కేసీఆర్ దున్న‌పోతు మీద వ‌ర్షం ప‌డిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది ఆరోపించారు. సర్కార్ నిర్లక్ష్య ధోర‌ణి వ‌ల్లే బోడ సునీల్ నాయ‌క్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలిపారు. సునీల్‌ది ఆత్మ‌హత్య కాద‌ని ముమ్మాటికి ప్ర‌భుత్వం చేసిన హ‌త్యేన‌ని అభివ‌ర్ణించారు. చ‌నిపోయే ముందు సునీల్ విడుద‌ల చేసిన వీడియోను చివ‌రి వాంగ్మూలంగా స్వీక‌రించి కేసీఆర్‌పై కేసు నమోదు చేసి డిమాండ్ చేశారు. లేదంటే యువ‌జ‌న కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జైల్ భ‌రో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం 1200 మంది యువ‌త ప్రాణాలు ఆర్పిస్తే వ‌చ్చిన తెలంగాణ‌లో ఉద్యోగాల కోసం మ‌ళ్లీ ఆత్మ‌హత్య‌లు జ‌ర‌గ‌డం బాధక‌ర‌మ‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే యువ‌త ప్రాణాలు విడుస్తున్నార‌ని తెలిపారు. యువ‌త ఎవ్వ‌రు అలా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని…. మీ ప‌క్షాన పోరాటం చేసేందుక యువ‌జ‌న కాంగ్రెస్ సిద్దంగా ఉంద‌ని వివ‌రించారు. అమ‌రుల త్యాగాల‌పై అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ శ‌వాల మీవ పేలాలు ఏరుకునే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని మండిప‌డ్డారు. త‌న కుటుంబంలో న‌లుగురికి ప‌ద‌వులు ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో ఉన్న యువ‌త గురించి ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ వ‌చ్చే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని న‌మ్మిన యువ‌తకు ఉద్యోగాలు ఇవ్వ‌కుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నార‌ని తెలిపారు.

* హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో DRUGS కు ‘బానిసలు’గా మారినవారు,అప్పుడప్పుడూ ఆ ‘మత్తు’లో జోగుతున్న వారిలో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు,ప్రముఖులు ఉన్నట్లు వస్తున్న సమాచారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది.బెంగుళూరులో పట్టుబడిన DRUGS దందా నిందితులు ఇచ్చిన CONFESSION స్టేట్మెంటు లో కొన్ని పేర్లు ఇప్పటికే వెలుగు చూశాయి.శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయానికి మరికొన్ని పేర్లు, వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నవి.నిందితుల వాంగ్మూలంలో TRS ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నట్టు కొన్ని వర్గాలు ధృవీకరిస్తున్నవి.నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పేరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కానీ ఇంకా CONFIRM కావలసి ఉన్నది.కర్నాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న TS కు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే DRUGS సేవనంలో వారి పాత్ర CONFIRM కావడం లేదు.నిందితుల వాంగ్మూలంలో ‘తెలంగాణ ఉద్యమకారుడు’ గా రతన్ రెడ్డి పేరు నమోదైందని అంటున్నారు. ఈ ఉద్యమ కారుడు ఎవరన్నది అస్పష్టంగా ఉన్నది.అతను ఉద్యమం ఎప్పుడు చేశాడో, ఏ జిల్లాకు సంబంధించిన వాడో తెలియదు.DRUGS వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ప్రముఖుల సంతానం, బంధువులు ఉన్నట్టు తెలుస్తోంది.తెలుగు సినీపరిశ్రమలో ‘చిన్న తరహా’ హీరో తనీష్ పాత్రపై అనుమానాలు ఉన్నవి.రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ గౌడ్ కు,తనీష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు,ఈ నేపథ్యంలోనే వాళ్ళు తరచూ బెంగుళూరుకు వెళ్ళి వస్తుంటారని ఒక సమాచారం.DRUGS సేవనంలో వీరి పాత్ర ఉన్నట్లు కర్నాటక పోలీసువర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.ఇటీవల బెంగళూరులో ప్రముఖ కన్నడ సినీ హీరో సుదీప్ కు చెందిన FARM HOUSE లో భారీ విందు జరిగింది. అందులో సినీ,రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నట్టు అక్కడి పోలీసు వర్గాలు చెబుతున్నవి.అలాగే ఆ పార్టీలో పాల్గొన్న TS ఎమ్మెల్యేలు, ఇతర వ్యాపారులు హైదరాబాద్ కు వచ్చిన తరువాత మళ్ళీ ఇక్కడా ఒక FARM HOUSE లో DRUGS తో కూడిన విందు చేసుకున్నట్టు ఒక కధనం ప్రచారంలో ఉన్నది.కర్ణాటకలో విద్యావ్యాపారం నిర్వహిస్తున్న ప్రముఖుడు అయిన నారాయణపేట TRS ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సోదరుని పాత్రపై పరిశోధన సాగుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందీప్ రెడ్డి,TRS ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి అత్యంత సమీప బంధువు.అతనే ఈ ‘ఆపరేషన్స్’ నిర్వహిస్తుంటాడని తెలియవచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా కనీసం 12 నల్లటి ‘సఫారీ’వాహనాలతో కాన్వాయ్ గా వెళతారు.DRUGS సేవిస్తున్న వారిలో ఒక ‘రెడ్డి’ఎమ్మెల్సీ కూడా ఉన్నట్టు తెలియవచ్చింది.అయితే అతని పేరు ఇంకా బయటకు రాలేదు.బెంగుళూరుకు చెందిన ACP సక్రి DRUGS కేసు దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలంగాణ, హైదరాబాద్ కోణంలో కొద్ది రోజులుగా ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఒక ప్రత్యేక బృందాన్ని ఆయన నియమించారని పోలీసు వర్గాలు చెబుతున్నవి.కాగా హైదరాబాద్, బెంగుళూరు, DRUGS రాకెట్,TRS నాయకుల పాత్రపై రహస్య నివేదిక కర్నాటక ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం క్రితమే అందినట్టు TRS వర్గాల ద్వారా తెలుస్తోంది.హైదరాబాద్ లో మార్చి రెండవ వారంలో భారీగా డ్రగ్స్ పట్టుబడినవి. నలుగురి ముఠాను అరెస్ట్ చేశారు. కోటి విలువచేసే DRUGS పట్టుబడడం సంచలనం రేపింది.హైదరాబాద్ లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని అర్ధమవుతుంది. అత్యంత ప్రమాదకరమైన హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను TS లో విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్రగ్స్ మాఫియా సభ్యులు పట్టుబడుతున్నా సమగ్ర దర్యాప్తు చేసి, డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టడంలో పోలీసులు విఫలమవుతున్నట్టు విమర్శలు వచ్చిపడుతున్నవి.ఎస్‌.ఓ.టీ పోలీసుల తనిఖీల్లో భారీగా కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ లభించినవి.ఈ ముఠా తమ కార్యకలాపాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటకలోనూ నిర్వహిస్తోందని పోలీసులు చెబుతున్నారు. వీరు ఈ డ్రగ్స్ ని ఎవరెవరికి విక్రయిస్తున్నారు? ఏయే ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు సాగిస్తున్నారు? వీరి వెనుక ఉన్న ‘ప్రముఖ’ నేతలు ఎవరు? అందులో TRS ప్రజాప్రతినిధులు ఉన్నారా?అసలు వీరు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ సేకరిస్తున్నారు? హైదరాబాద్ నగరంలో ఎంతమంది డ్రగ్స్ మాఫియా లీడర్లు ఉన్నారు ? వంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్ మహానగరంలో స్టూడెంట్స్ టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూ ఉంది. డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపడానికి అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కోటిక్స్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది.

* తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై మహిళ మెడలో గొలుసు తెంచుకు వెళ్లిన గుర్తు తెలియని దుండగులు.

* అనంతపురం జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై సెబ్ బృందం విస్తృత దాడులు నిర్వహించింది. జిల్లాలోని ఆమడగూరు, రొద్దం పి.ఎస్ ల పరిధిల్లో దాడులు నిర్వహించి నలుగురు నిందితులను అరెస్టు చేసి 3,440 టెట్రా పాకెట్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.