మిఠా పాన్, కలకత్తా పాన్, జర్ధా పాన్, కిట్ కాట్ పాన్, ఫైర్ పాన్, కేసర్ పాన్, స్విస్ చాక్లెట్ పాన్ మొదలైన ఏవేవో పాన్‌లు తిని ఉంటారు. కానీ, ఈ స్పెషల్ పాన్‌ని ఎప్పుడైనా తిన్నారా? పోనీ కనీసం చూశారా? లేకపోతే చూడండి. ఇంతకీ ఆ పాన్ ఏంటీ అంటారా.. అదే ‘గోల్డ్ పాన్’. కొబ్బరి, ఇలాచీ, లవంగాలు, చెర్రీస్, ఖర్జురా, మీథి పచ్చడి, ములేతి, గుల్కండ్, చాక్లెట్ వంటి వాటితో తయారుచేయబడే ఈ పాన్ ఢిల్లీలో ఇప్పుడు ఎంతో ఫేమస్ అయింది. ఈ పాన్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని యాము’స్ పాన్‌మహల్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ పాన్‌లో అన్ని మిశ్రమాలు కలిపిన తర్వాత చివరగా.. ఎంతో ప్రత్యేకంగా తయారు చేయించిన గోల్డ్ పేపర్ చుడతారు. అందుకే ఈ పాన్‌కు ‘గోల్డ్ పాన్’ అనే పేరొచ్చింది. ఈ పాన్ తింటే నోటి దుర్వాసన దరిచేరదు. ఇందులో వాడే గుల్కండ్ మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఇంత ప్రత్యేకంగా తయారుచేసే ఈ పాన్ కేవలం రూ. 600లకే లభిస్తోంది. దాంతో ఒక్కసారి ఈ పాన్ తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ ఈ పాన్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
గుల్కండ్ గోల్డ్ పాన్ తిన్నారా?
Related tags :