* తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది.
* రిటైర్డ్ అర్చకులకు సంబంధించి టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్దత నెలకొంది.
* నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ భార్య గోదావరిలో గల్లంతు
* తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే.. విజయనగరం జిల్లాలో మాత్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు… మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. అధిష్టానం నిర్ణయంపై సీనియర్ నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి మాజీ కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు డుమ్మా కొట్టారు.
* కేరళ అసెంబ్లీ పరిధిలో తొలిసారి ఓ ట్రాన్సజెండర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి అనన్య కుమారి నామినేషన్ వేశారు.సోషల్ జస్టిస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఆమెకు ఆ పార్టీ నేతల నుంచే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట.దీంతో తాజాగా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.కాగా LDF ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ మధ్య గట్టిపోటీ ఉంది.
* ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా .ఆదివారం అయినప్పటికీ రేపు కొనసాగనున్న విచారణ.జనసేన, బీజేపీ సహా పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు.రేపు ఎస్ఈసీ తరపున వాదనలు విననున్న హైకోర్టు .హౌస్ మోషన్ పిటిషన్ వేసిన వారి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి, వేదల వెంకటరమణ .గతేడాది మార్చి 15న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేశారు .
* ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్ జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్‌ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు.
* ఏపీ పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. బాధ, ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదన్నారు. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.
* ఎస్‌ఈసీ నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని జగన్‌రెడ్డి ఎలా ఖూనీ చేస్తున్నారో అర్థమైందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. అన్నిరాజకీయ పక్షాలు నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతున్నా… ఎన్నికలకు వెళ్లడం అప్రజాస్వామికమన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే..ఎన్నికలు జరపాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* అతడో సాదాసీదా ఆటో డ్రైవర్. అయితేనేం.. పేదల ఆకలి తీర్చే పెద్ద మనసు ఆయన సొంతం. నిత్యం వందల మంది ఆయన ఆటో కోసం ఎదురుచూస్తారు. కడుపు నిండాక కళ్లతోనే కృతజ్ఞతలు చెబుతారు. కుటుంబ పోషణకు రాత్రింబవళ్లు పనిచేసే ఆ శ్రామికుడు మిగిలిన కాస్త శక్తిని అన్నదాన సేవకే వెచ్చిస్తున్నాడు. ఆరేళ్లుగా నిస్వార్థ సేవాస్ఫూర్తితో ముందుకుసాగుతున్నాడు. భూమయ్య అనే ఆటో డ్రైవర్ విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రి వద్ద ఆరేళ్లుగా నిత్యం అన్నదానం చేస్తున్నాడు.
* ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవపల్‌పెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు.
* సర్పంచిగా పోటీ చేయించి వైకాపా నేతలు తనను మోసం చేశారని కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచి అభ్యర్థి గీత ఆరోపించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు. ఖర్చంతా ఆమెతో పెట్టించి చివరకు ప్రత్యర్థులకు మద్దతిచ్చారన్నారు. వ్యవసాయం చేసుకునే తనను ఎన్నికల్లోకి దించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఆదుకోవాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని గీత లేఖలో పేర్కొన్నారు.
* కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఠానే జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్ యజమానుల సంఘం నిరసన తెలియజేసింది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూతో తమ వ్యాపారాలు మరింత దెబ్బతింటున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా తమ డిమాండ్లు నెరవేరే దాకా జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ ఫీజును వాయిదాల వారీగా చెల్లించేందుకు అనుమతించడంతో పాటు రాత్రి 8 గంటల నుంచి విధించిన కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాక ఠానేతో పాటు డొంబ్లివి, కల్యాణ్, నవీ ముంబయి తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.
* దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కొవిడ్ భారీగా విజృంభిస్తోందని.. అందువల్ల రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. కరోనా విపత్తు సమయంలో కీలకంగా పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఇప్పటికే వ్యాక్సిన్ అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు పెంచామని, నిర్ణీత సమయంలో వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.
* నాగార్జునసాగర్ లోక్‌సభ ఉప ఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
* తెలంగాణ వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే స్వయంగా వెల్లడించారు. జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తానని ఆయన అన్నారు.