తానాలో పని చేయడానికి పదవులు అవసరం లేదని, చేయాలనే నిబద్ధత చాలని, 20ఏళ్లు ఏదో చేశామని సమయం గురించి బీరాలు పలకడం మాని ఏమి సేవ చేశారో సూటిగా చెప్పాలని కనెక్టికట్లో నిర్వహించిన ప్యానెల్లో తానా 2021 కార్యనిర్వాహక ఉపాధ్యక్ష అభ్యర్థి నిరంజన్ శృంగవరపు అన్నారు. తమ ప్యానెల్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, తటస్థ వేదిక ఎక్కడికైనా వచ్చి తమ వాదన వినిపిస్తామని ఆయన ప్యానెల్ సభ్యులు పేర్కొన్నారు. ప్రదీప్ గడ్డం, తరణి పరుచూరి, నాయునిపాటి విశ్వనాధ్, కొయ్యాడ రాం తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణను స్మన్వయపరిచారు.
####################