తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామల మెరుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలియాభట్, దీపికా పదుకొణే మొదలుకొని… అనన్య పాండే వరకు పలువురు భామలు తెలుగు సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకున్నారు. తాజాగా సోనాక్షి సిన్హాకి కూడా తెలుగు నుంచి పిలుపు అందినట్టు సమాచారం. సీనియర్ హీరోలు నటిస్తున్న చిత్రాల కోసం ఆమెని సంప్రదించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె ఇందులోని ఓ చిత్రానికి పచ్చజెండా ఊపిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి సోనాక్షి ఏ హీరోతో ఆడిపాడనుందనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.
తెలుగులోకి సోనాక్షి?
Related tags :