తొమ్మిదేండ్ల క్రితం హిందీ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో పాల్గొని ఆకట్టుకున్న నటి సన్నీ లియోనీ. అదే ఏడాదిలో ‘జిస్మ్ 2’ సినిమాలో నటించి కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు సాగిన నా సినీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. నేను నాకలలను కొనసాగించడానికి ఇదే సరైన ప్రదేశం అని భావిస్తున్నా. అందుకే నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నా. ఇక్కడే ఉండేందుకు ఎంతో సమయాన్ని కేటాయించాను. మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు ఎదరుచూస్తున్నాను. ప్రస్తుతం ‘ఎమ్‌టీవీ స్పిల్ట్స్ విల్లా’షోలో బిజీగా ఉన్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె హిందీ – తెలుగులో తెరకెక్కుతున్న ‘హెలెన్’, ‘కోకాకోల’లో నటిస్తోంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సీరీస్ చిత్రం ‘అనామిక’లో కీలకపాత్ర పోషిస్తోంది.
ఇక ఇండియాలోనే ఉంటాను
Related tags :