తానా 2021 ఎన్నికల్లో మహిళా సేవల విభాగ సమన్వయకర్తగా చికాగోకు చెందిన చాందినీ దువ్వూరి పోటీపడుతున్నారు. డా.కొడాలి నరేన్ ప్యానెల్ తరఫున బరిలో ఉన్న ఆమె TNIతో మాట్లాడారు. తానాలో మహిళలకు తగిన ప్రాధాన్యత లభించేలా తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. 1997లో విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వచ్చిన ఆమె తానాతో దీర్ఘకాలంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారు. తానా జాతీయ మహిళా సాధికారత కమిటీ సమన్వయకర్తగా కూడా ఆమె వ్యవహరించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడమే గాక ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. లాభాపేక్ష లేకుండా ఏమీ ఆశించకుండా సేవ చేయడమే తనకు ఇష్టమని ఆమె అన్నారు. కోవిద్ సమయంలో స్వచ్ఛందంగా కొంత మంది భారతీయులు కలిసి చికాగో ప్రాంతంలోని వయోవృద్ధులకు భోజనాలను సమకూర్చిన కార్యక్రమాన్ని ఈమె ముందు ఉండి నడిపించారు. అమెరికాలో గృహహింసకు బాధితులైన ప్రవాస తెలుగు మహిళలను వందల మందిని ఆమె వ్యక్తిగతంగా, ఆర్థికంగా, న్యాయపరంగా ఆదుకున్నారు. తెలంగాణా షీ టీంస్‌తో కలిసి ఆమె చాలా చురుగ్గా ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నారు. తనకు తానాలో మహిళా సేవల విభాగ సమన్వయకర్తగా అవకాశం కల్పిస్తే తన అపారమైన అనుభవాన్ని మహిళల స్వావలంబనకు, సంస్థలో వారి ప్రాధాన్యతకు తద్వారా బలోపేతమైన తానాకు కృషి చేస్తానని అంటున్నారు. ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు….
– UN-USA Women Team member
– BOD Member – Illinois Chamber of Commerce
– Program Manager for Young Entrepreneurs Academy – Teaching entrepreneurship @ Illinois Schools
– Faculty – International Association for Human Values.
– Philanthropist, ART of Living teacher
– Coordinator “Back to the Roots Project”
– BOD Women wing for “Overseas Volunteer for Better India”
– Women Empowerment Coordinator for “TANA: Telugu Association of North America
– Adopted a hospital in Prakasam Dist- Markapuram – Healthcare. Conducted Free pregnancy surgeries, Distributed PPE to medical staff. Provided Lunch/Dinner for medical staff. About 700 meals per day and about 30,000 MEALS.
– During COVID – Fed the needy; Daily cooked food for 4000 people per day migrant workers who have no source to cook. Provide 2000 grocery kits
– Working with Telangana Government, especially in koyyagudam, bogaram, siripuram, choutuppal, karimnagar, jogipet, narayanpet, chinnor, pochampally to provide INR 1000 per family. So far supported 1000 families.
– Working in few downtrodden area of Telangana, Hyderabad, Vizag and Markapuram
– Organizing committee for PM Narendra Modi events in NJ and California.
– Organized Venkaiah Naidu event in Chicago
– Organized Ex-CM Chandrababu Naidu events in Dallas & Chicago through APNRT
– Organized DSP, SS Thaman, AR Rahman, Mani Sharma and RP Patnaik music shows in USA.
– Awarded as Woman Achiever by ROJA RAMANI garu and
– Awarded Power Woman by International LIONs CLUB.
– Golden Star Icon Award
– Women of the Substance award
– Goodwill Brand Ambassador