Business

ఏసీలకు ఫుల్లు డిమాండ్-వాణిజ్యం

ఏసీలకు ఫుల్లు డిమాండ్-వాణిజ్యం

* ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తమ తయారీ కార్యకలాపాల్ని భారీ ఎత్తున విస్తరిస్తున్నాయని అపెక్స్‌ అవెలాన్‌ కన్సల్టెన్సీ ఛైర్మన్‌ గిరిజా పాండే తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్‌ఐ)’ వంటి ప్రత్యేక చర్యలే అందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న అపెక్స్‌ అవెలాన్‌ కన్సల్టెన్సీ భారత్‌లోకి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

* కోవిడ్‌-19 మ‌ళ్లీ ఉగ్ర‌రూపం దాల్చుతుంది. మ‌రోవైపు ఆరోగ్య సంర‌క్ష‌ణ ఖ‌ర్చులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధిక హామీతో వ‌చ్చే ఆరోగ్య బీమా పాల‌సీల‌కు దేశంలో డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. అందుకు త‌గిన‌ట్లుగా అధిక హామీతో కూడిన పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్తపాల‌సీల కంటే ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీకి రిస్టోరేష‌న్ బెనిఫిట్(పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌యోజ‌నం) ప్లాన్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఒక సంవత్స‌రంలో పాల‌సీకి సంబంధించిన హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్న‌ప్ప‌టికీ, మ‌రోసారి వినియోగించుకునేందుకు వీలుగా ఒరిజిన‌ల్‌ క‌వ‌రేజ్‌ను పున‌రుద్ధ‌రిస్తారు.

* భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. “గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు.

* మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు మీ వద్ద లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ లాభం కనిపిస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకోండి. మేము మీ కోసం చౌక వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం.