DailyDose

ఖమ్మం జిల్లాలో 2క్వింటాల గంజాయి స్వాధీనం-నేరవార్తలు

ఖమ్మం జిల్లాలో 2క్వింటాల గంజాయి స్వాధీనం-నేరవార్తలు

* ఖమ్మం జిల్లా వివిపాలెం వద్ద సుమారు 200 కిలోలు గంజాయి వివి పాలెం రఘునాధపాలెం మండలం మెయిన్ రోడ్ నందు దొరికింది ఇది సుమారు నాలుగు లక్షలు సరుకు ఉంటుంది అని అంచనా. టాస్క్ఫోర్స్ ఎస్సై మేడ ప్రసాద్ మరియు సిబ్బంది,రఘనాదపలెం ఏసై వరల శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది గంజయ్ పట్టుకున్నారు

* తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు నిన్న తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

* గుంటూరులో ఫోన్ పే పేరుతో కొత్త తరహా మోసం బయట పడింది. కస్టమర్‌ కేర్‌ పేరుతో అకౌంట్‌లో డబ్బులు మాయం చేశారు. నగరంలోని ఐపీడీ కాలనీకి చెందిన నాగరాజు క్యాటరింగ్ చేస్తున్నాడు. తన మిత్రుడు అత్యవసరంగా రూ. 400 కావాలంటే ఫోన్‌ పే యాప్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ స్నేహితుడు డబ్బు జమ కాలేదన్నాడు. ఫోన్‌ పే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి సమస్యను చెప్పాడు. ఈనెల 5న ప్రసాద్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి ఫోన్‌ పే కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. రూ.400 తిరిగి జమ చేస్తామని నమ్మించాడు.

* ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీ ప్రాంతంలో మారణకాండ సృష్టించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రాలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్ర పోలీసులకు సమాచారమిచ్చాయట. అయితే ఏపీలో సరిగ్గా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఛత్తీస్‌గడ్‌ నుంచి ఏపీలో మావోయిస్టులు వచ్చారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధుల్లో భయాందోళన నెలకొంది.

* మచిలీపట్నం బలరామునిపేట కు చెందిన చీలి సతీష్ (23) పీక కోసి హత్యాయత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద 1.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.