పూర్ణ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. తేజ త్రిపురాన కథానాయకుడు. కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘యుగాల భారత స్త్రీని…’ అంటూ సాగే గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో వై.ఎస్.షర్మిళ విడుదల చేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘‘బలమైన కథతో రూపొందించిన చిత్రమిది. తప్పక ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. వై.ఎస్.షర్మిళ మా చిత్రంలోని పాట విడుదల చేసి మాకెంతగానో ప్రోత్సాహం అందించారు’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో ఇందిరాశోభన్, ఇందూజారెడ్డి, విజయ్.ఎల్.కోట, విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పూర్ణ పాట విడుదల చేసిన వై.ఎస్.షర్మిల
Related tags :