Food

బిస్కెట్లు తింటే మెదడుపై ప్రభావం

బిస్కెట్లు తింటే మెదడుపై ప్రభావం

పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినేబిస్కట్లు, కేకులు మెదడు పనితీరు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు పరిశోధకులు. బిస్కట్లకూ, కేకులకు మంచిఫ్లేవర్‌రావడానికి ఉపయోగించే ట్రాన్స్‌ఫ్యాట్‌ అనే కొన్ని రకాలకొవ్వుపదార్థాలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వీరు చెబుతున్నారు.ఈట్రాన్స్‌ఫ్యాట్‌ ఎక్కువగా ఉపయోగించి తయారు చేసే బిస్కట్లు, కేకులు తిన్నవారిలో క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందనివారు హెచ్చరిస్తున్నారు. ఇదేవిషయం మీద కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందినపరిశోధకులుపది సంవత్సరాల నుంచి నలభై అయిదు సంవత్సరాల మధ్య వయస్సు గలస్త్రీ, పురుషుల మీద కొన్నినెలల పాటు పరి శోధనలు నిర్వహించారు. వీరినిరెండు గ్రూపులుగావిభజించి ఒక గ్రూపు వారికి ట్రాన్స్‌ఫ్యాట్‌ ఎక్కువగా ఉపయోగించి తయారు చేసిన కేకులు, బిస్కట్లు అధికంగా ఇచ్చారు. మరికొందరికి నామమాత్రంగా ఇచ్చారు. కొన్ని నెలలఅనంతరం ఈ రెండు గ్రూపుల ఆరోగ్య, మానసికస్థితినిపరిశీలించారు. బిస్కట్లు, కేకులు ఎక్కువగా తిన్న వారిలోజ్ఞాపకశక్తి మందగించడంతోపాటు ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తడాన్నివీరు గుర్తించారు.బిస్కట్లు, కేకులు తక్కువగా తిన్నవారిలో ఈ సమస్యలు పెద్దగా గుర్తించలేదు. ఈ ఆరోగ్య సమస్యలకు ట్రాన్స్‌ఫ్యాట్‌ అనే కొవ్వుపదార్థమే కారణమనివారు స్పష్టం చేస్తున్నారు.