ScienceAndTech

మీ వేలిముద్రలతో మీ మొత్తం చరిత్ర చెప్తారు

Your family history is now available through your fingerprints

వేలిముద్రలతో ఓవ్యక్తిచరిత్రను మొత్తం చెప్పడం ప్రస్తుతం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే..అవేవేలిముద్రలు మన పూర్వీకులు గురించి కూడా చెబుతాయంటున్నారుశాస్త్రవేత్తలు.వేలిముద్రల ఆకృతి, గీతల సంఖ్య వంటిలక్షణాలను టైప్‌ 1గా, వేలిముద్రలుఎలాకట్‌ అవుతున్నాయి.. వాటి మధ్యన గల దూరం తదితర లక్షణాలను టైప్‌ 2గావర్గీకరించి పరిశోధనలు చేశారు. ఈ మేరకు 61 మంది ఆఫ్రికా మహిళలు, 61 మందిఆఫ్రికా పురుషులు, మరో 61మంది యూరోపియన్‌ మహిళలు,61మందిపురుషులవేలిముద్రలను కొన్ని సంవత్సరాల పాటు.. పరిశీలించామని నార్త్‌ కరోలినాయూనివర్సిటీశాస్త్రవేత్త అన్‌ రోస్‌ వెల్లడించారు. ఆఫ్రికన్‌, యూరోపియన్‌మహిళలు, పురుషుల వేలిముద్రలను పరిశీలిస్తే.. టైప్‌ 1లో పెద్దగా తేడాలులేవని.. అయితే.. టైప్‌లోమాత్రం స్పష్టమైన తేడాలున్నట్లు గుర్తించామనిపేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగాపరిశోధనలు చేయాల్సి ఉందని ప్రొఫెసర్‌రోజ్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధనలతో ఒకరి కుటుంబచర్రితను తెలుసుకోగలిగేఅవకాశం ఉందని చెప్పారు.