భారత్‌కు చెందిన దంపతులు దేశంకాని దేశంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన 32ఏళ్ల బాలాజీ రుద్రావర్ ఐటీ ఉద్యోగి. 2015 ఆగస్టులో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉండగా.. బాలాజీ భార్య ఆర్తి(30) ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం బాలాజీ కుమార్తె న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో ఏడుస్తూ కన్పించింది. చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో డోర్ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. బాలాజీ, ఆయన భార్య లివింగ్ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీ తన భార్యను పొడిచి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ మృతికి గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు.
న్యూజెర్సీలో భారతీయ దంపతుల అనుమానస్పద మృతి
Related tags :