ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది. బస్సులో ప్రయాణిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు ఆర్టీసీ బస్సులో ₹3కోట్లు పట్టివేత
Related tags :