#teamTANA పేరిట తానా 2021 ఎన్నికల్లో బరిలో డా.నరేన్ కొడాలి ప్యానెల్ గురువారం రాత్రి న్యూజెర్సీలో మరోసారి ప్రచారం నిర్వహించింది. ఆయన ప్యానెల్ నుండి పాఠశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అద్దంకి పద్మలక్ష్మి ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో ఉన్నారు. ఆమెతో పాటు నరేన్ ప్యానెల్ సభ్యుల గెలుపు కోసం ఈ ప్రచారాన్ని నిర్వహించారు. తానా ప్రస్తుత అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ నివాస ప్రాంతం కావడం, నిరంజన్ ప్యానెల్ నుండి వాసిరెడ్డి వంశీ ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో ఉండటం వంటి కీలక అంశాల కారణంగా నరేన్ ప్యానెల్ న్యూజెర్సీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, నదెళ్ల గంగాధర్, వేమన సతీష్‌లు ఈ ప్రాంతంలో పలు పర్యాయాలు సుడిగాలి పర్యటనలు జరిపి ప్రవాసుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. గురువారం నాటి కార్యక్రమంలో నరేన్ ప్యానెల్ నుండి BODగా బరిలో ఉన్న పొట్లూరి రవి, ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్న మందలపు రవి తదితరులు ప్రచారాన్ని నిర్వహించారు.
##############