* నాగ్‌పుర్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మృతిచెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
* ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప.. తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రఫీ ఆస్తి పన్ను మార్పు కోసం నరసింహారెడ్డి నుంచి.. రూ.9 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం..
* కామవరపుకోట మండలం…కే ఎస్ రామవరం విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు రాత్రి నిద్ర మాత్రలు వేసుకోని ఆత్మహత్యాయత్నం..వారిలో 11 ఏళ్ల బాలుడు అడపా మురళీకృష్ణ ఉండడం గమనార్హం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న నలుగురు వ్యక్తులు గమనించిన స్థానికులు.ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..అప్పుల బాధల మరే ఇతర కారణాల అనే దానిపై దర్యాప్తు చేస్తున్న పోలిసులు..
* బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఉస్మాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు..- తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో ఉస్మాన్ ను హత్య చేసిన శివ.. అతనికి సహరించిన వినీత్ ను అరెస్టు చేసిన బాలాజీ నగర్ పోలీసులు..- కేసు వివరాలు వెల్లడించిన నెల్లూరు టౌన్ డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి..
* విజయవాడలోని సత్యనారాయణపురంలో గల శ్రీనగర్ కాలనీలో తండ్రి, జాగాన రవి (38) ,కూతురు గీత సహస్ర (10) తండ్రి మరియు కూతురు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయినట్టు తెలుస్తుంది.
* అనంతపురం కూడేరు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
* లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు…10 మందికి గాయాలు మహబూబ్ నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో శనివారం రోడ్డుప్రమాదం సంభవించింది.జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను మహబూబ్ నగర్ సర్కార్ దవాఖానకు తరలించారు.గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు.