అదృష్టంతో పాటు తాను విధిని బలంగా విశ్వసిస్తానని చెప్పింది కన్నడ సొగసరి రష్మిక మందన్న. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు జీవితం తాలూకు తన ఆలోచనలు, ఆకాంక్షలు వేరుగా ఉండేవని..అనుకోకుండా సినీరంగం వైపు అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. అధ్యాపక వృత్తిని తాను అమితంగా ఇష్టపడతానని, టీచర్ కావాలన్నది ఒకప్పటి తన లక్ష్యమని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘మైసూర్ కాలేజీ రోజుల్లో నా ఊహలు భిన్నంగా ఉండేవి. టీచర్ వృత్తిలో స్థిరపడాలనుకున్నా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నాన్న వ్యాపారాన్ని చూసుకోవాలనుకున్నా. అధ్యాపక వృత్తిలో ప్రవేశించే లక్ష్యంతో సైకాలజీ, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ చేశాను. అయితే విధి మరోలా తలచింది. అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు జీవితాన్ని తరచి చూసుకుంటే అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అన్నింటికంటే విధి మన జీవితాల్ని బలంగా నిర్దేశిస్తుందన్న విషయం అర్థమైంది’ అని తాత్విక ధోరణిలో చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది
అదృష్టం+విధి
Related tags :