తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిరంజన్ శృంగవరపు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం డీసీ-మేరీల్యాండ్-వర్జీనియా(DMV) ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వర్జీనియాకు చెందిన ఆటా అధ్యక్షుడు బూజాల భువనేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అభ్యర్థించారు. తమ ప్యానెల్ ప్రధానోద్దేశాలు, తాము గెలిస్తే తానాలో తీసుకొచ్చే నూతన విధివిధానలపై ఆయనతో చర్చించారు. తానా తర్వాత అమెరికాలో అంతటి ప్రాచుర్యం పొందిన ఆటా సంస్థకు నేతృత్వం వహిస్తున్న ఆయన మద్దతు ఈ ఎన్నికల్లో కీలకమని వారు పేర్కొన్నారు. వారి అభ్యర్థనకు భువనేష్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
############