తానా 2021 ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం నిరంజన్ శృంగవరపు ప్యానెల్ వర్జీనియా ప్రవాసులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా తన ప్యానెల్‌ను పరిచయం చేసిన అనంతరం నిరంజన్ మాట్లాడారు. 2021 తానా ఎన్నికల్లో తమ ప్యానెల్‌కు ఇప్పటివరకు వర్జీనియా ప్రాంత ప్రవాసుల మద్దతు, స్పందన అద్భుతంగా ఉందన్నారు. తనతో సహా తమ ప్యానెల్ అభ్యర్థులందరీ సేవా కార్యక్రమాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, ప్రత్యర్థి ప్యానెల్ అభ్యర్థులను తమ ప్యానెల్ అభ్యర్థులను బేరీజు వేసుకుని తమ అమూల్యమైన ఓటు తమ ప్యానెల్ సభ్యులందరికీ విరివిగా అందజేసి గెలిపించవల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమానికి కూకట్ల శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరించారు. తాళ్లూరి జయశేఖర్, లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
###########