తానాకు రాబడి-ఖర్చులు, విరాళాలకు సంబంధించిన ప్రతి పైసా లెక్క తానా పత్రికలో ప్రచురించే విధంగా చర్యలు చేపడతానని 2021 తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ నుండి కోశాధికారి అభ్యర్థిగా బరిలో ఉన్న కొల్లా అశోక్‌బాబు TNIతో అన్నారు. తానా సభ్యులు ఉన్నది కేవలం ఎన్నికలపుడు బ్యాలెట్ల మీద సిరాచుక్కలు వేయడానికి మాత్రమే పరిమితం కాదని సంస్థకు $125 డాలర్లు కట్టి సభ్యత్వం తీసుకున్నందుకు వారికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి అంశానికి జవాబుదారీదనంగా ఉండాలన్నదే తన ప్రయత్నమని వెల్లడించారు. దాతల సొమ్ము కూడా కష్టార్జితమేనని అటువంటి నిధులకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వారం తానా బ్యాలెట్లు వస్తున్నాయని నిరంజన్ ప్యానెల్ సభ్యుల చరిత్ర, సేవా తత్పరత సామాజిక మాధ్యమాల ద్వారా గానీ వ్యక్తిగతంగ సంప్రదించి గానీ మొదట క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని వారు సంతృప్తి చెందితేనే ఓటు వేయాలని ఆయన కోరారు. యువతరం, నవతరం, వైద్యులు, మహిళలు కలగలిసిన తమ ప్యానెల్ తానా గతిని గమనాన్ని మార్చేదిగా ఉంటుందని అశోక్ పేర్కొన్నారు.
తానా పత్రికలో ప్రతి పైసాకు లెక్క రాస్తా – TNIతో కోశాధికారి అభ్యర్థి కొల్లా అశోక్
Related tags :