సెట్లో పాటలు పాడుకుంటున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా, షాహిద్‌కపూర్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షాహిద్, రాశీ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ వెబ్‌సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే… రాశీ ఖన్నా నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు రాశీఖన్నా.
షాహిద్-రాశి పాటలు
Related tags :