‘ఆర్‌ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తుండగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదితిరావు హైదరీ పాత్రను ‘మహ’గా పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. పోస్టర్లో అదితిరావు కన్నీటి చెమ్మతో దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ ట్వీటర్ వేదికగా స్పందిస్తూ..‘‘మనోహరమైన అందాలతార అదితిరావు ఇందులో ‘మహ’గా నటిస్తోంది. మా ‘మహాసముద్రం’ చిత్రానికి ఆత్మ వంటిది’’అంటూ పేర్కొన్నారు. శర్వానంద్ సరసన అదితి నటించనుందని సమాచారం. యాక్షన్ ప్రేమకథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిత్రంలో జగపతిబాబు చుంచుమామగా కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా తోట రాజా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అదితి ఆత్మ
Related tags :