టాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే వుంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు రెండోసారి కరోనా సోకింది. ఓసారి కరోనా వచ్చిన తర్వాత రెండోసారి రావడం అరుదుగా జరుగుతుందని వైద్యులు చెపుతున్న…..బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావటంతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టాలీవుడ్ నుంచి గాని, ఆయన ఫ్యామిలీ నుంచి ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇప్పటికే హీరో పవన్ కళ్యాణ్ కూడా ఐసోలేషన్‌లోనే ఉండగా…….మరోవైపు నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా రావడం టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.
ICUలో బండ్ల గణేష్
Related tags :