పిజ్జా తినాలనిపిస్తే ఏం చేస్తారు.. ఏదో ఒక స్టోర్‌కు వెళ్లి తింటారు. ఓపిక లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ మీ ఇంటికే అందిస్తాడు. అలాంటిది పిజ్జా ఆర్డర్ చేస్తే.. ఒక రోబో డెలివరీ చేసే రోజు వస్తుందని ఊహించారా. ఇలాంటి వ్యవస్థను న్యూరో రోబోటిక్స్, డొమినోస్ సంస్థలు సంయుక్తంగా ఆవిష్కరించాయి. న్యూరో సంస్థకు చెందిన స్వయంచోదిత వాహనం, ఆన్-రోడ్ డెలివరీ రోబో ‘ఆర్2’ ఈ పనిచేయనుంది. ఇప్పటికే అమెరికా రవాణా శాఖ ఈ రోబో వాహనానికి అనుమతులు ఇచ్చింది. అమెరికాలోని హూస్టన్, టెక్సాస్ నగరాల్లో ఎంపిక చేసిన ఖాతాదారులకు ఈ సేవలను డొమినోస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్2 రోబోతో పిజ్జా డెలివరీ పొందాలంటే.. మనకు నచ్చిన రోజు, సమయంలో ప్రీపెయిడ్ ఆర్డరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్2 లొకేషన్, ప్రత్యేక పిన్ నెంబరును కొనుగోలుదారుకు డొమినోస్ పంపుతుంది. రోబో లొకేషన్‌ను జీపీఎస్ సాయంతో ట్రాక్ చేసుకోవచ్చు. ఆర్2 వాహనం వచ్చిన తర్వాత టచ్‌స్క్రీన్‌పై పిన్ వివరాలు ఇస్తే.. వాహనం తలుపు తెరుచుకుని పిజ్జా డెలివరీ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికాలోనే అందుబాటలో ఉన్నా, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించొచ్చు.
బీప్…బీప్…డోమినోస్ రోబో పిజ్జా తెచ్చింది
Related tags :