Business

మీకు మీ క్యాన్సిల్ అయిన విమాన టికెట్ రిఫండ్ వచ్చిందా?

Indian Aviation Ministry To Issue Refund To Cancelled Tickets

రద్దు అయిన విమానాల టికెట్లు విషయంలో ఎయిర్‌లైన్లకు పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు!

గతేడాది లాక్‌డౌన్ సమయంలో క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి.. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇటీవల ఇదే విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రద్దు అయిన విమాన సర్వీసులకు సంబంధించిన డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది. దాంతో గో ఎయిర్, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశాయి.

కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇంకా ప్రయాణికులకు రిఫండ్ చేయలేదు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ విమానయాన సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన డబ్బులను వెంటనే ప్రయాణికులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు.